నెల్లూరు జిల్లాలోని పొడలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మే నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అనుభవమున్న.. చంద్రబాబుగా పరిపాలన చేస్తారని ప్రజలు ఎన్నుకున్నారు.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల ఆస్తులు ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని ఆయన మండిపడ్డారు. వైసీపీకి 40 శాతం ఓట్లు వచ్చాయి.. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడితే వచ్చిన ఓట్లు 60 శాతం.. మా ప్రభుత్వ హాయంలో జరిగిన లోపాలను గుర్తించి సమీక్షించుకుంటామన్నారు. వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం.. నేతలతో కలిసి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
టీడీపీ చోటా నాయకుల ఉడత బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజల్లో వైసీపీకి ఆదరణ తగ్గలేదు.. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని… సీబీఐ విచారణ వేస్తామని అంటున్నారు.. ఎవరి చేత విచారణ చేయించినా ఎలాంటి భయం లేదన్నారు. ఇక, జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అనేది సమాజం.. ప్రతి పక్షం లేకుంటే ప్రభుత్వం నిర్వీర్యం అవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఓట్లను వేయించుకున్నారు.. ఇప్పుడు పింఛను తప్ప మరే పథకం గురించి మాట్లాడడం లేదు.. నాకు పదవి ఉన్నా.. లేకున్నా సర్వేపల్లి నియోజకవర్గ ఇంటి బిడ్డనే.. అధికారం ఉన్నపుడు ప్రజలకు న్యాయం చేసాం.. ఇప్పుడు ప్రజలకు అన్యాయం జరగనియ్యకుండా అడ్డుకుంటానని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.