పెప్ ట్రీట్‌మెంట్: హెచ్ఐవీ/ఎయిడ్స్ కి చెక్.. అసలు పెప్ అంటే ఏమిటి..?

-

ఇది వరకు అసలు ఈ ఎయిడ్స్ గురించి కానీ హెచ్ఐవీ గురించి కానీ ఎక్కువ అవగాహన ఉండేది కాదు. కానీ ఇప్పుడు దీని గురించి అందరికీ తెలుస్తోంది. ఎయిడ్స్ గురించి కానీ హెచ్ఐవీ గురించి కానీ సరైన అవగాహన లేక పోవడంతో చాలా మంది ఎన్నో ఇబ్బందులని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ సమస్య ఉంటే పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ ని ఇస్తారు. అసలు ఇంతకీ ఈ ట్రీట్మెంట్ ఏమిటి..? ఎవరికీ ఇస్తారు వంటి వివరాలను చూద్దాం.

పెప్ ట్రీట్మెంట్ అంటే ఏమిటి..?

హెచ్‌ఐవీ రోగులకు ఇచ్చే మందుల్లో పెప్‌ ని కూడా ఒక భాగంగా ఇస్తుంటారు. పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫైలాక్సిస్ ఇది. టాబ్లెట్ల ఫార్మ్ లో దీన్ని ఇస్తారు.

ఎవరికి ఇది ఇస్తారు..?

ఒకవేళ ఏ వ్యక్తి అయినా సరే హెచ్ఐవీ సోకిన వ్యక్తితో సెక్స్ చేస్తే వాళ్లకి ఇస్తారు.
లేదంటే వారితో ఎవరైనా అసురక్షిత శృంగారంలో పాల్గొన్నా ఇస్తారు.
వారితో ఓరల్ సెక్స్ ని చేసిన వారికీ ఇస్తారు.
హెచ్‌ఐవీ రోగుల కోసం పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి కూడా దీన్ని ఇస్తూ వుంటారు.
సెక్స్‌లో పాల్గొన్న లేదా వైరస్‌ వ్యాపించినట్లు అనుమానం వస్తే మొదట 72 గంటల్లోనే పెప్ చికిత్సను స్టార్ట్ చేయాల్సి వుంది.

ఎన్ని రోజులు ఈ ట్రీట్మెంట్ ఉంటుంది..?

28 రోజులు లేదా నెల రోజులు దీన్ని తీసుకుంటూ ఉండాలి. ఎలాంటి గ్యాప్ కూడా తీసుకోకూడదు. రోజూ పక్కా తీసుకోవాలి.

వీళ్ళకి కూడా ఈ చికిత్స అవసరం:

హెచ్ఐవీ సోకిన వాళ్ళకి ఇది అవసరం. లేదంటే ఆ వ్యక్తితో శృంగారం చేస్తే కూడా తీసుకోవాలి.
అలానే హెచ్ఐవీతో కలుషితమైన రక్తాన్ని తాకినప్పుడు కూడా.
లైంగిక దాడి బాధితులు కి కూడా దీన్ని ఇస్తారు.
ఓ నీడిల్ నుండి ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా.

Read more RELATED
Recommended to you

Exit mobile version