ఒకొక్క రైతుకి ఎకరానికి రూ. 17,500 చొప్పున.. మొత్తం రూ. 26,775 కోట్లు బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా రైతు భరోసా పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డ వాటిని వెంటనే రైతులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆ నాడు రైతు బంధు మా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ 11 సీజన్లు ఇచ్చాం. 12వ సీజన్ ఇయ్యకపోతుంటిమా..? కోడ్ రావడం వల్ల ఇయ్యలేకపోయామని తెలిపారు.
డిసెంబర్ 03 కి ముందు తీసుకుంటే.. 5వేలు.. డిసెంబర్ 09 తరువాత తీసుకుంటే 7,500 ఇస్తామన్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఇచ్చారా అధ్యక్ష అని ప్రశ్నించారు. మార్పు.. మార్పు అని ఊదరగొట్టారు అధ్యక్ష. మార్పు అంటే ఏందో అనుకున్నాం అధ్యక్ష. పేరు మార్చారు. రైతు బంధు పేరు రైతు భరోసా గా మార్చారని తెలిపారు కేటీఆర్. పైసలు మాత్రం అవే.. వానా కాలం మొత్తం ఎగ్గోట్టారని తెలిపారు.