ఇప్పటికే మన దేశం లో పలు రకాల వ్యాక్సిన్ లు ట్రయల్స్ పూర్తి చేసుకున్నాయి. కాగా తాజాగా మన దేశం లో మరో వ్యాక్సిన్ ట్రయల్స్ లు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ను మన దేశం లో విడుదల చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ సన్నహాలు చేస్తోంది. ఈ మేరకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి భారత ఔషద నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది.
ఇక ఇందులో ఫలితాలు సానుకూలంగా వస్తే స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ కూడా మన దేశం లో అందుబాటులోకి వస్తుంది. ఇక ఇప్పటికే మన దేశం లో స్పుత్నిక్ వి కి అనుమతులు ఉన్నాయి. రష్యా నుండి ఈ వ్యాక్సిన్ ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. అయితే ఇది కూడా రెండు డోస్ ల వ్యాక్సిన్ కాగా స్పుత్నిక్ లైట్ సింగిల్ డోస్ వ్యాక్సిన్ కావడం విశేషం. ఇక ఇప్పటికే స్పుత్నిక్ లైట్ కు కొన్ని దేశాల్లో ట్రయల్స్ పూర్తి కాగా అనుమతులు కూడా ఇచ్చారు.