సెప్టెంబర్ 17.. తెలంగాణ విమోచన దినం. నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన దినం. భారతదేశంలో తెలంగాణ విలీనమైన రోజు. అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆద్వర్యంలో ఆపరేషన్ పోలో పోళీసు చర్య ద్వారా నిజాం నిరంకుశ పాలనకు చరమ గీతం పాడిన రోజు. ఐతే ఈ రోజుని విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ బీజేపీ పట్టుబడుతుంది. నిజాం నవాబు పాలన అంతం అయిన సందర్భాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ప్రయత్నిస్తుంది.
ఈ మేరకు అనేక చర్చలు జరుగుతున్నాయి. అటు బీజేపీ నాయకులు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదాయాత్ర సెప్టెంబరు 17వ తేదీ వరకు నిర్మల్ చేరుకోనున్నట్లు తెలుస్తుంది. నిర్మల్ లో జరగనున్న భారీ బహిరంగ సభకు కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. తెలంగణ విమోచన దినం సందర్భంగా అమిత్ షా, కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్న బీజేపీ డిమాండ్ ఏ మేరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.