ఈ ఫోటో షూట్ ఐడియా నారా లోకేశ్‌దేనని టీడీపీ వర్గాల బోగట్టా : విజయసాయిరెడ్డి

-

మరోసారి టీడీపీ నేతలపై తన దైన స్టైల్‌లో సెటైర్లు వేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఇవాళ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు అనే అవినీతిపరుడ్ని అరెస్ట్ చేస్తే తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి టీడీపీ పరువు తీసుకుందని విమర్శించారు. సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డి. హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు స్వేచ్ఛకు బేడీలు వేస్తారా? అని పౌర సంఘాలు నిరసన తెలపడం చూశామని, కానీ చంద్రబాబు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ఈ ఫోటో షూట్ ఐడియా నారా లోకేశ్‌దేనని టీడీపీ వర్గాల బోగట్టా అని చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. అంతకుముందు కూడా ఓ ట్వీట్ చేశారు. వీళ్లు చేసే సంకెళ్ల ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే సెలెబ్రేషన్స్ ప్రజలకు చంద్రబాబు చేసిన కుంభకోణాల గురించి అవగాహన పెంచుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారని, చంద్రబాబు జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయటపడ్డాయని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version