చిరంజీవి నిఖార్సయిన రాజకీయ నాయకుడని…పవన్ కళ్యాణ్ వారాంతపు రాజకీయ నాయకుడని కౌంటర్ ఇచ్చారు పేర్నినాని. తాను గెలిచి తన పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలను చిరంజీవి గెలిపించుకున్నారు.. పవన్ కళ్యాణ్ ఏం చేశాడని ప్రశ్నించా రు మాజీ మంత్రి పే ర్ని నాని. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి చాలా తప్పు చేసినట్లు పవన్ మాట్లాడుతున్నాడు.. చిరంజీవి చెడిపోయినట్లు…తాను పత్తిత్తు అయినట్లు మాట్లాడుతున్నాడన్నారు.
పవన్ బస్సు యాత్ర ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు…షూటింగులు ఏమైనా ఉన్నాయా? అడ్వాన్సులు ఇచ్చే ప్రొడ్యూసర్లకు ఆయాసం వస్తోందేమో కానీ, మనం ఆయాసం లేకుండా అడ్వాన్సులు తెగ తీసుకుంటున్నాం కదా! నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు అడ్వాన్సులు తీసుకున్న సినిమాలు పూర్తవ్వాలంటే 2050 వరకు ఆగాల్సిందే. ఇప్పుడు ఎవరో ఒకరిని ముంచాల్సిందే… జెండా మోసిన కార్యకర్తనో, డబ్బులిచ్చిన నిర్మాతలతోనో, దర్శకులనో ముంచాలి. పవన్ కల్యాణ్ ఓ వీకెండ్ పొలిటీషియన్. అసలు, పవన్ కల్యాణ్ ప్రజారాజ్యం పార్టీని ఎందుకు వదిలేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు.