టీడీపీ నేతలు, బండారుపై పేర్ని నాని ఫైర్

-

వైసీపీ ఎమ్మెల్యే, మాజీమంత్రి పేర్ని నాని టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. బండారు సత్యనారాయణమూర్తి-రోజా ఉదంతంపై పేర్ని నాని స్పందించారు. టీడీపీలో బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు, ఇంకొందరు నేతలు ఉన్నారని… వీళ్లు మనిషి జన్మ ఎత్తారు అనలేమని ఘాటుగా విమర్శించారు. ఛీ… మా కడుపున ఇలాంటి వెధవలు పుట్టారు అని వాళ్ల తల్లిదండ్రుల ఆత్మలు క్షోభిస్తాయని అన్నారు. వీళ్లకు విలువలు, వ్యక్తిత్వం అంటూ ఏమీ లేదని, ఇలాంటి వాళ్ల గురించి మనం చర్చించుకోవడం కూడా అనవసరమేనని పేర్ని నాని పేర్కొన్నారు. ఇక, ఇటీవల కాలంలో నారా బ్రాహ్మణి ఏపీ ప్రభుత్వంపై చేస్తున్న ట్వీట్లపైనా పేర్ని నాని స్పందించారు. ఆమె తన అత్తామామలపై ట్వీట్లు చేయబోయి ప్రభుత్వంపై చేసిందేమోనని వ్యాఖ్యానించారు. వాళ్ల అత్తాకోడళ్ల మధ్య కూడా ఏమైనా తగాదాలు ఉన్నాయేమో ఎవరికి తెలుసు అని పేర్కొన్నారు.

ఇది ఇలా ఉంటె, పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టూ) రాజ్యాంగేతర శక్తుల్లా వ్యవహరిస్తుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని మాజీ మంత్రి, తెదేపా పొలిటా బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మచిలీపట్నంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడచిన ఎన్నికల్లో గెలిచి మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి పేర్ని నాని కుటిల రాజకీయాలతో అన్ని వ్యవస్థలను భ్రష్టుపటిస్తున్నారని విమర్శించారు. ఆయన అక్రమాలు, అవినీతి సంపాదనకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. గతంలో వడ్డి రంగారావు. పేర్ని కృష్ణమూర్తి, నడకుదిటి నరసింహారావులతో పాటు తాను మంత్రిగా పనిచేసినా ఏనాడూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించలేదన్నారు. పేర్ని నాని, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చేశారన్నారు. ప్రజలు తాము ఎన్నుకున్నది తండ్రినా… కొడుకునా అన్న మీమాంసలో ఉన్నారంటే పరిస్థితి ఏవిధంగా దిగజార్చారో అర్థం చేసుకోవచ్చన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version