చంద్రబాబుకు లీగల్ ములాఖత్‌లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

-

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో విజయవాడ ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న చంద్రబాబుకు రోజుకు రెండు ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు కేసులు ఉన్న నేపథ్యంలో… ఆయనను న్యాయవాదులు కలిసేందుకు మూడు ములాఖత్ లు ఇవ్వాలని చంద్రబాబు లాయర్లు కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో రోజుకు రెండు ములాఖత్ లు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో రేపటి నుంచి చంద్రబాబుకు రెండు ములాఖత్ లు ఇవ్వనున్నారు.

కనీసం 45 నుంచి 50 నిమిషాల పాటు చర్చించేందుకు అనుమతించేలా జైలు అధికారులను ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో చంద్రబాబును కలిసేందుకు రోజుకు రెండుసార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం కల్పించారని చెప్పారు. అయితే, ప్రస్తుతం దీనిని రోజుకు ఒకసారికి కుదించారని చెప్పారు. లీగల్ ములాఖత్ పై చంద్రబాబు లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించిన ఏసీబీ కోర్టు.. పిటిషన్ లో ప్రతివాదుల పేర్లను చేర్చలేదనే కారణంతో విచారణకు తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ప్రస్తుతం విచారించాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version