కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఇవాళ మీడియాతో మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ షిప్ లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అన్నారు. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నం పై కొన్ని అనుమానాలు ఉన్నాయని వివరించారు. తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వటం లేదని పవన్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని వెల్లడించారు. షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు పవన్ తో ఉంటే ఆయన అనుమతి ఇవ్వలేదని చెప్పటం ఏంటి అని ప్రశ్నించారు. ముందు రోజు కలెక్టర్ వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది వాళ్ళే కదా అని ఆగ్రహించారు. పవన్ ను షిప్ ఎక్కడవద్దని చంద్రబాబు చెప్పి ఉండాలని… లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలని కాకినాడ పోర్టులో పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు.