ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్డు, రవాణా సౌకర్యం లేకపోవడంతో అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, తండా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా డోలీలు కట్టుకుని మరీ సుదూర ప్రాంతాలకు కాలి నడకన వెళ్లాల్సి వస్తోంది. తాజాగా మరోసారి డోలి కట్టి ఓ గర్భిణీనిని వాగు దాటించి గిరిజనులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ఈ హృదయవిదారక ఘటన విశాఖ జిల్లా దేవరపల్లి మండలం బొడిగరువు గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. పురుటి నొప్పులతో బాధపడుతున్న సాహూ శ్రావణి అనే గర్భిణీని డోలి కట్టి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు మార్గం ద్వారా నడుచుకుంటూ వెళ్లి గిరిజనులు వాగు దాటించారు. అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.తమకు ఈ డోలి కష్టాలను తొలగించి త్వరగా గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనుల ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
డోలి కట్టి, వాగు దాటించి గర్భిణీని ఆసుపత్రికి తీసుకెళ్లిన గిరిజనులు
విశాఖ జిల్లా దేవరపల్లి మండలం బొడిగరువు గ్రామంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న సాహూ శ్రావణి అనే గర్భిణీని డోలి కట్టి అస్తవ్యస్త రోడ్డు, వాగు దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లిన గిరిజనులు.
ఈ డోలి కష్టాలు తొలగించి తమ… pic.twitter.com/OtaNY5kvzW
— Telugu Scribe (@TeluguScribe) December 2, 2024