ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం అనేది పెద్ద టాస్క్ అయిపోయింది. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియజేసేందుకు ప్రత్యేకమైన క్లాసులు కూడా ఉంటున్నాయి. అయితే మీ పిల్లల్ని సరైన డిసిప్లిన్ లో పెట్టాలంటే కొన్ని విషయాల్లో మీరు కఠినంగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల్లో ఒక అలవాటును మాన్పించాలి. అదేంటో, ఎందుకు తెలుసుకుందాం.
పిల్లలు చాలా తెలివైనవారు. వాళ్లు తల్లిదండ్రుల కన్నా తెలివైన వాళ్ళు. అందుకే పంతం పట్టి తాము కావాలనుకున్న దాన్ని ఎలాగైనా తల్లిదండ్రుల చేత చేయించుకుంటారు. దానికోసం వారు రకరకాల వేషాలు వేస్తారు. కొందరు ఏడుస్తారు, కొందరు అలుగుతారు. ఇలా ఏదో ఒకటి చేసి పంతాన్ని నెగ్గించుకుంటారు.
మీరు ఇప్పుడు పిల్లల్లో పంతం తగ్గించాలి. అలా చేయాలంటే వాళ్లు అలిగినప్పుడల్లా కొనివ్వడం మానివేయాలి. ముందుగా అలగకూడదని చెప్పాలి. వారు అలిగి ఏడ్చారన్న ఉద్దేశంతో మీరు వాళ్లకు కావాల్సినదాన్ని ఇవ్వకూడదు.
మీరలా ఇస్తూ పోతే ఇంకా స్ట్రాంగ్ గా తయారై, మీ మాట వినకుండా పోతారు. వాళ్లు అలిగినా కూడా మీరు కావాల్సింది ఇవ్వకపోతే కాసేపటికి వాళ్ళు ఊరుకుంటారు. అలా ఊరుకోవాలంటే.. మీరు మొదటి నుంచి జాగ్రత్తగా ఉండాలి.
పిల్లలు చాలా విషయాల్లో అలుగుతారు, ఆ విషయాలు ఏంటో తెలుసుకుని.. వాళ్లను వాటికి దూరంగా ఉంచాలి. ఉదాహరణకు వాళ్లు ఫోన్ కావాలని అడిగారనుకోండి. ఫోన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉన్నాయా మీరు చెప్పాలి. దానికన్నా ముందుగా మీరు ఫోన్ వాడకాన్ని తగ్గించాలి.
అలక తగ్గిపోతే పంతం తగ్గుతుంది. దీనివల్ల వాళ్లు మెంటల్ గా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అందుకే పిల్లలు అలిగినప్పుడు అయ్యో పాపం అని జాలి పడకండి.