పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఒకేసారి కాకుండా ప్రభుత్వాలు రోజుకు 36 నుండి 38 పైసల వరకు పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. సెప్టెంబర్ 28 నుండి ఇప్పటివరకు పెట్రోల్ ధర 23 సార్లు పెరుగుతూ వచ్చింది. అదే విధంగా డీజిల్ ధర 24 సార్లు పెరుగుతూ వచ్చింది. దాంతో పెట్రోల్ ధర రూ.7.11 పెరగగా…డీజిల్ ధర రూ.8.43 గా ఉంది. ఇక తాజాగా ఈ రోజు కూడా పెట్రోల్ పై 36 పైసలు డీజిల్ పై 38 పైసలు పెరిగింది.
పెరిగిన ధరలతో హైదరాబాద్ లో పెట్రోల్ లీటరు ధర రూ.112.23 కు చేరింది. అదేవిధంగా డీజిల్ ధర రూ.105.84 కు చేరింది. ఇక ఏపీ లోని గుంటూరు లో పెట్రోల్ ధర రూ.114.66 కు చేరగా డీజిల్ ధర.రూ.110 గా ఉంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం ధరల తగ్గింపు విషయంలో నిమ్మకు నీరెత్తనట్టు గా వ్యవహరిస్తున్నాయి.