తటస్థంగా పెట్రోల్, డీజిల్ ధరలు

-

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. చమురు ధరల్లో కూడా ఈ రోజు మార్పులేదు. అటు డీజిల్ ధరల్లో కూడా ఎలాంటి మార్పులు లేవు. పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 దాటింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో లీటర్ పెట్రోల్ రూ.107.45కు చేరుకుంది. డీజిల్ రూ.97.95 వద్ద ఉంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో పెట్రోల్ రూ.106.13, డీజిల్ రూ.98.49గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.104.11, డీజిల్ రూ.97.70గా ఉంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.103.05, డీజిల్ రూ.97.20గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ రూ.102.48, డీజిల్ రూ.94.54, ముంబైలో పెట్రోల్ రూ.105.24, డీజిల్ రూ.96.72, పాట్నాలో పెట్రోల్ రూ.101.21, డీజిల్ రూ.94.52గా ఉంది. జమ్ము కాశ్మీర్‌లో పెట్రోల్ రూ.102.11, లడక్‌లో రూ.104.56గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. పెట్రోల్ రూ.99.16, డీజిల్ రూ.89.18గా ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version