న్యూఢిల్లీ: ఆయిల్ ధరలు ఇవాళ తటస్థంగా ఉన్నాయి. ఇప్పటి వరకూ 35 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బుధవారం కాస్త ఊరట కలిగించాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా కొనసాగుతున్నాయి. నిన్న ఏ ధర ఉందో ఈ రోజు అదే ధర నడుస్తోంది. రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.21గా ఉంది. డీజిల్ లీటర్ రూ. 89.36గా నడుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ధరలు నడుస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, జోగులాంబ గద్వాల, నిర్మల్ లో లీటర్ డీజిల్ ధర రూ.100గా ఉంది. ఆదిలాబాద్‌లో పెట్రోల్ రూ. 107 కాగా హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105గా అమ్మకాలు జరుగుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, కృష్ణా, కర్నూలు, నెల్లూరులో లీటర్ పెట్రోల్ రూ. 107గా ఉంది. మిగిలిన జిల్లాలో రూ. 106కు లీటర్ పెట్రోల్ అమ్ముతున్నారు. లీటర్ డీజిల్ పలు చోట్ల రూ.100గా విక్రయాలు జరుగుతున్నాయి.