న్యూఢిల్లీ: వాహనదారులకు కొంతకాలంగా పెట్రో పిడుగు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 35సార్లు పెట్రోల్ ధరలు పెరడగంతో ఆ ప్రభావం నిత్యాసరాలపై పడుతోంది. దీంతో వాహనదారులతో పాటు ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నారు. నిన్న, మొన్న పెరిగిన పెట్రోల్ ధరలు ఇవాళ తటస్థంగా ఉన్నాయి. అటు డీజిల్ ధరల్లో కూడా ఎలాంటి మార్పుల్లేవు.
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19గా ఉంది. డీజిల్ ధర రూ. 89.72గా ఉంది. కోల్ కతాలో లీటర్ పెట్రోల్ రూ. 101.35, రూ. డీజిల్ రూ. 92.81. ముంబైలో పెట్రోల్ ధర రూ. 107.20 కాగా డీజిల్ రూ. 97.29గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.01 కాగా డీజిల్ రూ. 94.33గా ఉంది. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 104.58 కాగా డీజిల్ రూ. 95.09. హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ రూ. 105.15గా ఉండగా డీజిల్ రూ. 97.78గా కొనసాగుతోంది. అత్యధికంగా జైపూర్ లో లీటర్ పెట్రోల్ రూ. 108.21 కాగా డీజిల్ రూ. 99.01గా ఉంది.