వాహనదారులకు మరోమారు పెట్రో షాక్ తగిలింది. రోజురోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపెడుతోంది. తాజాగా మరోమారు పెట్రోల్, డిజిల్ ధరలు పెరిగాయి. ఇప్పటికే పెరుగుతన్న ధరలతో అల్లాడుతున్న ప్రజలకు పెరుగుతున్న ధరలు గుదిబండలా మారాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 31 పైసలు, లీటర్ డిజిల్ పై 38 పైసలు పెరిగాయి. ఇన్నాళ్లు సెంచరీకి చేరువగా ఉన్న డిజిల్ ధరలు తాజా పెంపుతో సెంచరీని దాటింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో డిజిల్ ధరలు వంద దాటింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 109.62 గా ఉంటే డిజిల్ ధర రూ.101.86, గుంటూర్ లో లీటర్ పెట్రోల్ ధర 109.82 ఉంటే, డిజిల్ ధర 102.06 గా ఉంది ఇక హైదరాబాద్ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 107.73, డిజిల్ ధర రూ.100.51 గా ఉంది. పెరిగిన పెట్రోల్ డిజిల్ ధరలతో వాహనదారులపై మరింత భారం పడనుంది.