ఇప్పటికే అన్ని రకాల మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ కాలు కదపాల్సిన పనిలేకుండా ఉన్న చోటునుండే ఫోన్ పే వంటి మొబైల్ సేవలు వినియోగించుకుంటున్నారు. కరెంటు బిల్లు కట్టడం దగ్గర నుంచి కిరాణా బిల్లు వరకూ అన్ని ఫోన్ పే ద్వారానే చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని ఫోన్ పే యూజర్ల కోసం రూపొందించింది. కరోనా కారణంగా ఎవ్వరూ కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు.
కానీ ప్రతి ఒక్కరికీ నిత్యావసర వస్తువులు తప్పనిసరి. వాటిని కొనుగోలు చేసేందుకు ఇప్పుడు ఫోన్ పే ఒక కొత్త ఫీచర్ నీ తయారుచేసింది. యాప్‌లో స్టోర్స్ సెక్షన్ ఓపెన్ చేస్తే మనకు రెండు కొత్త ఫిల్టర్స్ కనిపిస్తాయి. ‘కరెంట్లీ ఆపరేషనల్’, ‘హోమ్ డెలివరీ’ పేరుతో ఆ ఫిల్టర్స్ నీ మనం చూడవచ్చు. ‘కరెంట్లీ ఆపరేషనల్’ అన్న ఆప్షన్ చూస్తే తెరిచి ఉన్న షాపుల వివరాలు కనిపిస్తాయి. ‘హోమ్ డెలివరీ’ ఫిల్టర్ అప్లై చేస్తే సరుకులు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే షాపుల వివరాలు కనిపిస్తాయి.
స్థానిక కిరాణా షాపులతో కలిసి ఫోన్ పే యూజర్లకు ఈ సేవలు అందిస్తోంది. ఒకవేళ స్వయంగా వెళ్లి సరుకులు తెచ్చుకోవాలనుకుంటే షాపులు ఎక్కడ తెరిచి ఉన్నాయో తెలుసుకొని మనం ఆయా షాపులకు వెళ్లొచ్చు. మనం వెళ్ళవలసిన అవసరం లేకుండా సరుకులు కావాలనుకుంటే హోమ్ డెలివరీ ఆప్షన్ నీ ఎంచుకోవచ్చు. అన్ని చోట్లా లాక్‌డౌన్ ఉన్న ఈ పరిస్థితిలో నిత్యావసర వస్తువుల కొనుగోలు చేసేందుకు,
ఎటువంటి ఇబ్బంది పడకుండా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా స్టోర్స్ పేజ్‌లోనే ‘పే నౌ’ అనే ఫీచర్ ను ఉపయోగించి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన పని లేకుండా ‘పే నౌ’ క్లిక్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఫోన్ పే అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ సేవలను ఉపయోగించి ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను సురక్షితంగా పాటించవచ్చు.