సోషల్ మీడియా లో మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. నిజానికి నకిలీ వార్త ఏది..? నిజమైన వార్త ఏది అనేది తెలుసుకోవడం చాలా అవసరం. నకిలీ వార్తల వలన చాలా మంది మోసపోతూ ఉంటారు. నిజమైన వార్త ఏది నకిలీ వార్త ఏది అనేది తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో కూరుకు పోవాల్సి ఉంటుంది చాలామంది నకిలీ వార్తలు చూసి నిజం అని భావించి డబ్బులు కట్టడం వంటివి చేస్తూ ఉంటారు.
ఇప్పటికే చాలా నకిలీ వార్తలు ఉద్యోగాలు పేరు తో స్కీములు పేరు తో వచ్చాయి తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అసలు ఆ వార్త ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం… బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎంబిబిఎస్ పూర్తి చేసిన వారితో జూనియర్ డాక్టర్ లతో సమానం అని ఒక వార్త సోషల్ మీడియాలో వచ్చింది.
ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఈ విషయాన్ని చెబుతూ నోటిఫికేషన్ విడుదల చేసిందా ఇది నిజమా కాదా అనేది ఇప్పుడు చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది ఇందులో ఏ మాత్రం నిజం లేదు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఎలాంటి నోటిఫికేషన్ ని జారీ చేయలేదు సోషల్ మీడియాలో వచ్చిన ఈ వార్త వట్టి నకిలీ వార్త మాత్రమే కాబట్టి అనవసరంగా ఇటువంటి వార్తలను నమ్మి మోసపోకండి. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది.