విషాదం: బాలుడిని పీక్కుతిన్న పందులు…!

-

కరోనా వల్ల దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో దేశం లో అన్ని రంగాలు మూత పడ్డాయి. ఈ నేపధ్యంలో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెక్కాడితే కాని కడుపు నిండని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం వారు అలాంటి వారి కోసం రకరకాలు గా ఆదుకుంటున్నారు. అయితే మరి అనేక జీవ జంతు జాలానికి ఆహారం దొరక్క ఏది దొరికితే దాని మీద దాడి చేస్తున్నాయి. ఇందుకు హైదరాబాద్ లో జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లో సైదాబాద్ సింగరేణి కాలనిలో మూడేళ్ల బాలుడిపై పందులు దాడి చేసి చంపేశాయి. మంగళ వారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పందులు దాడి చేయడంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనితో ఆ బాలుడి తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. ఈ ఘటనపై బాలల హక్కుల సంఘం హెచ్ఆర్పి లో అత్యవసర పిటిషన్ వేసారు. ఈ ఘటన లో మృతి చెందిన బాలుడి అంత్యక్రియల కోసం వెంటనే జి హెచ్ ఎం సి అధికారులు డబ్బులు చెల్లించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ నిర్లక్ష్యం కారణంగా మూడేళ్ల హర్ష వర్ధన్ అనే బాలుడు మృతి చెందాడు. దీనికి నైతిక భాద్యత వహిస్తూ ఆ అధికారుల పై తక్షణ చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఏది ఏమైనా లాక్ డౌన్ పుణ్యమా అని అన్ని జంతువులు రోడ్డ్లేక్కాయి. కాని వాటి ధాటికి మనుషులకు ఏ ఆపద రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి అని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version