కరోనా వైరస్ నేపధ్యంలో ఇప్పుడు ప్రజల ఆర్ధిక వ్యవస్థ మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరే కరోనా మాత్రం కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఈ తరుణంలో ప్రజల ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకి మరింతగా దిగజారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈఎంఐ ల పై మూడు నెలల పాటు మారిటోరియం విధించాలి అని నిర్ణయం తీసుకుంది.
దీనికి బ్యాంకు లు కూడా అంగీకారం తెలిపాయి. దీనితో గృహ రుణాలు, ఇతరత్రా లోన్లు ఉన్న ఉద్యోగులు వ్యాపారులు అందరూ కూడా ఇప్పుడు కాస్త ఫ్రీ అవుతున్నారు. ఈ తరుణంలో బ్యాంకు లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కు కీలక విజ్ఞప్తి చేసాయి. ప్రస్తుతం విధించిన మూడు నెలల మారిటోరియం ని మరో ఆరు నెలల వరకు పోడిగించాలి అని పేర్కొన్నారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రజలు ఆర్ధిక కష్టాల్లో ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాలని కోరాయి. అయితే దీని వెనుక బ్యాంక్ ల వ్యూహం మరొకటి ఉంది… ఏంటీ అంటే మారిటోరియం ఉన్నన్ని రోజులు కూడా వడ్డీలు పెరుగుతాయి. బ్యాంకు లకు అది పెద్ద ఎత్తున కలిసి వచ్చే అంశం. లక్ష రూపాయలు లోన్ తీసుకున్న వాళ్లకు రెండు వేల వరకు వడ్డీ పెరుగుతుంది. అంటే 20 లక్షలు తీసుకున్న వాళ్లకు, 50 లక్షలు తీసుకున్న వాళ్లకు…? అందుకే బ్యాంకు లు ఇప్పుడు అవకాశాన్ని వాడుకోవాలని అనుకుంటున్నాయి.