దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ రిక్కర్ స్కాం కేసులో నేడు అరుణ్ రామచంద్ర పిళ్ళై వాంగ్మూలం ఉపసంహరణ కేసు విచారణకు వచ్చింది. తన వాంగ్మూలం వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని అరుణ్ దాఖలు చేసిన పిటిషన్ పై స్పెషల్ కోర్టు విచారించింది.
అయితే లిక్కర్ కేసులో బలమైన వ్యక్తికి మేము నోటీసులు ఇవ్వగానే పిళ్లై తన స్టేట్మెంట్ మార్చుకున్నారని న్యాయస్థానానికి వివరించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఈ మేరకు స్పెషల్ కోర్టు లో ఈడీ కీలక వాదనలు వినిపించింది. చాలా కీలక సమయంలో పిళ్ళై తన వాంగ్మూల ఉపసంహరణ చేసుకున్నారని తెలిపింది. పిళ్ళై విచారణకి సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది.
పిళ్ళై ను ఒత్తిడి చేయలేదు, బెదిరించలేదని న్యాయస్థానానికి తెలిపింది ఈడి. 18, సెప్టెబరు 2022 లో పూర్తి స్టేట్మెంట్ ఇచ్చారని.. సెకండ్, థర్డ్ స్టేట్మెంట్లలో కూడా వివరాలు మరోసారి కన్ఫర్మ్ చేశారని వివరించింది. ఆయనను టార్చర్ చేస్తే మిగిలిన స్టేట్మెంట్ లలో ఎలా కన్ఫర్మ్ చేస్తారని స్పష్టం చేసింది. మార్చి తర్వాతే స్టేట్ మెంట్ మార్చుకున్నారని.. ఆయన స్టేట్ మెంట్ ఎందుకు మార్చుకున్నారో అర్థం అవుతోందని ఈడి కోర్టుకు తెలిపింది.