తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పందించారు. పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండిస్తూ అమెరికా నుంచి రోహిత్ రెడ్డి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారని రోహిత్ రెడ్డి అన్నారు.

గతంలో బీజేపీ తరఫున వచ్చిన వారిని బహిరంగంగా ప్రపంచానికి పట్టించానని రోహిత్ రెడ్డి చెప్పారు. కెసిఆర్, కేటీఆర్ కు సైనికుడిగా పనిచేయడమే నా లక్ష్యం అంటూ రోహిత్ రెడ్డి వీడియోలో మాట్లాడారు. ప్రస్తుతం రోహిత్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో రోహిత్ రెడ్డి బిజెపి పార్టీలోకి చేరడం లేదని ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది. ఈ వీడియో చూసిన అనంతరం ఇలాంటి వార్తలను వైరల్ చేయడం ఆపేస్తారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రోహిత్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యేగా గతంలో పనిచేశారు. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రోహిత్ రెడ్డి పరాజయం పాలయ్యారు.