IPL 2022: మెగా వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కెప్టెన్లు..

-

బెంగళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం 2022 రెండో రోజు ప్రారంభమైంది. తొలి సెట్ లో దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కరం ను సన్రైజర్స్ హైదరాబాద్. 2.6 కోట్లు వెచ్చించి అతడినీ కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. మరోవైపు టీమిండియా సీనియర్ టెస్ట్ ప్లేయర్ రహానే కు ఈసారి ఊహించని షాక్ తగిలింది. అజింక్యా రహనే నేను కోల్కతా నైట్ రైడర్స్ కేవలం కోటి రూపాయలకు మాత్రమే కొనుగోలు చేసింది.

అయితే ఈ వేలం పలువురిని కోటీశ్వరులను చేయగా… స్టార్ ఆటగాళ్లు గా పేరు ఉన్న పలువురు ఆటగాళ్లు మాత్రం తక్కువ ధరకే అమ్ముడుపోయారు. ఇందులో ఆస్ట్రేలియా వన్డే జట్టు అలాగే t20 ఫార్మేట్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లాండ్ వన్డే అలాగే టి20 ఫార్మేట్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రముఖంగా ఉన్నారు.

కెప్టెన్లు గా బ్యాటరీలు గా తమ జట్లను విజయవంతం గా రాణిస్తున్న వీరిద్దరిని మెగా వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గతంలో ఐపీఎల్లో ఆరోన్ ఫించ్ ఆర్సిబి కి ప్రాతినిధ్యం వహించగా… ఇయాన్ మోర్గాన్ కోల్కతా నైట్రైడర్స్ కు ఆడాడు. అయితే వీరి గత పర్ఫామెన్స్ చాలా చెత్తగా ఉంది. ఇలాంటి నేపథ్యంలోనే ఈసారి వేలంలో వీరిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో ఆరోన్ ఫించ్ అలాగే మోర్గాన్ అమ్ముడుపోని లిస్ట్ లోకి వెళ్ళిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version