జంక్ ఫుడ్స్ అంటే..ఈరోజుల్లో ఇష్టపడని వాళ్లు అంటూ ఉండరేమో కదా..ఫైవ్ స్టార్ హోటళ్ల నుంటి తోపుడుబళ్ల వరకూ చైనీస్ ఫుడ్ తింటూ ఎంతో మంది ఎంజాయి చేస్తున్నారు. బిర్యానీల్లో, పులావుల్లో..కొన్ని చైనీన్ వంటకాల్లో అజినోమోటో( Monosodium) కచ్చితంగా వాడుతుంటారు. ఇది వంటకు రుచిని ఇస్తుందనే అందరూ వాడుతుంటారు..కానీ దీనివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చైనీస్ ఆహారంలో కనిపించే అజినోమోటో నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది నరాలను దెబ్బతీస్తుంది. మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుందట. ఇందులో ఉండే గ్లుటామిక్ యాసిడ్ మెదడులోని న్యూరోట్రాన్స్‌మిటర్‌లా పనిచేస్తుంది. శరీరంలో అధిక స్థాయిలో ఇది మెదడును దెబ్బతీస్తుంది..
గర్భిణీ స్త్రీలు చైనీస్ ఫుడ్ తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే.. ప్రధాన కారణం అజినోమోటో. ఇందులో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అయితే గర్భధారణ సమయంలో సోడియం తీసుకోవడం చాలా తగ్గించాలి. అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరం అవుతుంది. ఇది పిల్లల హార్ట్ పై కూడా ప్రభావం చూపుతుంది.
అజినోమోటో అధిక రక్తపోటుకు కారణమవుతుంది. మీరు ఇప్పటికే బీపీ పేషెంట్ అయితే అజినోమోటో యాడ్ చేసిన వాటిని అసలు తినకూడదు. ఇది రక్తపోటు సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
చూడ్డానికి పంచాదరపలుకుల్లా ఉండే అజినోమోటో ఆరోగ్యాన్ని ఇన్ని విధాలుగా పాడుచేస్తుందట..వాడేవాళ్లు కాస్త జాగ్రత్తపడాల్సిందే..!
-Triveni Buskarowthu