అసెంబ్లీ ఎన్నికలపై PK సర్వే రిపోర్ట్ రెడీ..టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లంటే !

-

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన టీఆర్ఎస్ పాలన పై అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించిన సమాచారం అందుతోంది. ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తి గా ఉన్నప్పటికీ కొన్ని విషయాలపై వ్యాస గా ఉన్నట్లు సర్వేలు గుర్తించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు అలాగే పింఛన్లు మంజూరు కాకపోవడం మరియు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై అసంతృప్తి కనిపిస్తోందని ప్రశాంత్ కిషోర్ బృందం నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా టిఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని.. రెండో స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని పీకే సర్వే లు నివేదించాలి.

కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి, పార్టీ నేతల మధ్య విభేదాలు అలాగే బహిరంగ ఆరోపణలు పెరుగుతున్నాయని అప్రమత్తం చేసినట్లు సమాచారం అందుతోంది. సీఎం కేసీఆర్ పై మాత్రం ప్రజల్లో విశ్వాసం అలాగే ఆదరణ ఏమాత్రం తగ్గలేదని సర్వేలో తేలిందట. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం తధ్యం అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version