గులాబీ ఎమ్మెల్యేలకు ‘పీకే’ టెన్షన్…సైడ్ చేస్తారా?

-

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..సీఎం కేసీఆర్ కు భయపడుతున్నారో లేదో తెలియదు గాని..ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ కు మాత్రం భయపడుతున్నారని చెప్పొచ్చు…ఎందుకంటే ఇప్పుడు గులాబీ ఎమ్మెల్యేల భవిష్యత్ పీకే చేతుల్లోనే ఉంది. ఇప్పుడు పీకేనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సీట్లు డిసైడ్ చేయనున్నారు…ఎవరికి సీటు ఇవ్వాలి..ఎవరికి ఇవ్వకూడదు అనేది పీకే చేతుల్లో ఉంది.

గత కొంతకాలం నుంచి ప్రశాంత్ కిషోర్…కేసీఆర్ కోసం పనిచేస్తున్న విషయం తెలిసిందే…ఇప్పటికే పీకే టీం రాష్ట్రంలో దిగి పనిచేస్తుంది…మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పీకే టీం పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలని ఎలా దెబ్బతీయాలి…అలాగే పార్టీని ఎలా బలోపేతం చేయాలనే అంశాలని పీకే టీం చూసుకుంటుంది. ఎప్పుడు ఎలా రాజకీయం నడపాలనేది అంతా పీకే టీం హ్యాండ్స్ లోనే ఉంది. అలాగే ఇప్పటినుంచే టీఆర్ఎస్ పార్టీలో గెలుపు గుర్రాలని అన్వేషించే పనిలో పడింది పీకే టీం.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్తితి గురించి పీకే టీం సర్వే చేస్తుంది. ఇప్పటికే నలభై మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని పీకే టీం….కేసీఆర్ కు లిస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే…ఖచ్చితంగా వారిని మార్చాల్సిందే అని, లేదంటే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని తేల్చి చెప్పింది. దీంతో ఆ నలభై మంది ఎవరా? అని చెప్పి టీఆర్ఎస్ లో టెన్షన్ మొదలైంది.

పైగా రోజురోజుకూ కాంగ్రెస్, బీజేపీలు పుంజుకుంటున్నాయి…దీంతో పీకే టీం…మరింతగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేలంతా పీకే టీంకు భయపడి…పనిచేయాల్సిన పరిస్తితి వచ్చింది. అసలే ఆ నలభై మంది ఎవరో క్లారిటీ రావడం లేదు..దీంతో అందరూ అలెర్ట్ అయ్యి పనిచేస్తున్నారు. మొత్తానికి పీకే దెబ్బకు గులాబీ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version