ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఇక మన దేశంలో కూడా పరిస్థితి చాలా భయంకరంగా మారుతుంది. దీనితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటున్నాయి ప్రభుత్వాలు. ఇక ఇది పక్కన పెడితే నేడు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడతారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేయనున్నారు.
ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మోడీ ఏ ప్రకటన చేస్తారు అనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. లాక్ డౌన్ ని పాక్షికంగా సడలించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రధాని కూడా లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగించే ప్రకటన చేస్తారని, అదే సమయంలో కొన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలకు సడలింపు ఇస్తారని అంటున్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగిస్తే నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది.
కాబట్టి లాక్ డౌన్ విషయంలో వాటికి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ రంగానికి కూడా మినహాయింపు ఇచ్చి ఆంక్షలు ఎత్తివేసే ఆలోచనలో ఉన్నారట. పరిమిత సంఖ్యలో పరిశ్రమల పునఃప్రారంభానికి అనుమతిస్తారని తెలుస్తుంది. వ్యవసాయ సీజన్, కోతల కాలం కావడంతో ఈ రంగానికి పూర్తిస్థాయి మినహాయింపు ఇవ్వనున్నారు. వైరస్ ప్రభావం అసలే లేని దాదాపు 400 జిల్లాలను గ్రీన్ జోన్‌గా ప్రకటించి అక్కడ వ్యవసాయం, నిర్మాణ, తయారీ రంగాల కార్యకలాపాలకు అనుమతిస్తారని సమాచార౦.