మీరాబాయి చానుపై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం

-

టోక్యో ఒలంపిక్స్ లో భారత్ బోణీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ టోక్యో ఒలంపిక్స్ లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో…సిల్వర్‌ మెడల్‌ సాధించి రికార్డులను తిరగరాసింది. సిల్వర్‌ మెడల్‌ సాధించిన తొలి భారతీయ మహిళగా మీరా భాయ్ చరిత్ర సృష్టించింది.

అయితే…వెయిట్‌ లిప్టింగ్‌ లో సిల్వర్‌ మెడల్‌ సాధించిన మీరాబాయి చానుకు దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ ప్రధాని నుంచి సామాన్య ప్రజలకు వరకు అందరూ మీరాబాయి చానును కొనియాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ కూడా మీరాబాయి చానుపై పొగడ్తల వర్షం కురిపించారు. ”శ్రీమతి ఎస్. మిరాబాయి చాను భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా టోర్నమెంట్లలో తనను తాను గుర్తించుకున్నారు. ఆమె నైపుణ్యానికి మరియు అంకితభావానికి ధన్యవాదాలు, ఈ ప్రతిభావంతులైన వెయిట్ లిఫ్టర్ క్రీడా ప్రియులందరికీ ప్రేరణ. ఖేల్ రత్న ప్రదానం చేసినందుకు ఆమెకు అభినందనలు.” అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. అటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా మీరాబాయి చానును అభినందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version