నాటు నాటును ఏళ్ల తరబడి స్మరించుకుంటా : ప్రధాని మోదీ

-

తెలుగు సినిమా ఎట్టకేలకు ఆస్కార్​ను ముద్దాడింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్​లో జరుగుతున్న 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట పురస్కారం గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటును ఆస్కార్ అవార్డు వరించింది. ఇప్పటికే లాస్ ఏంజెల్స్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ వేడుకకు హాజరైంది. సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌లు అవార్డును అందుకున్నారు. వేదికపై అవార్డు అందుకున్న అనంతరం పురస్కారంతో అభివాదం చేశారు. అనంతరం కీరవాణి ఆస్కార్ వేదికపై పాట పాడారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటుకు ఆస్కార్ రావడం పట్ల రాజకీయ ప్రముఖులు అభినందనలు చెబుతున్నారు. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్​ఆర్ఆర్ టీమ్​కు బెస్ట్ విషెస్ చెప్పారు. ‘రాజమౌళి బృందానికి ప్రధాని మోదీ అభినందనలు. నాటునాటుకు ఆస్కార్‌తో భారత్‌ గర్వపడుతోంది. కీరవాణి, చంద్రబోస్‌కు అభినందనలు. నాటునాటు పాట ప్రపంచమంతా పేరు తెచ్చుకుంది. నాటునాటు పాటను ఏళ్ల తరబడి స్మరించుకుంటారు.’ అని ప్రధాని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version