వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనీసం 400 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది.ఈ క్రమంలో ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గోన్నారు. ఈ క్రమంలో యాంకర్ ఎలక్టోరల్ బాండ్ లపై పలు ప్రశ్నలు అడిగారు. వాటి సమాధానంగా ప్రధాని మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలతో డబ్బు జాడను కనుగొనడంలో ఎలక్టోరల్ బాండ్‌ల సహాయపడ్డాయని అన్నారు.
కాగా ,బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఎలక్ట్రోలర్ బాండ్‌ల చట్టాన్ని సుప్రీం కోర్టు రద్దు చేయగా.. దేశవ్యాప్తంగా ఆయా పార్టీలకు సంస్థలు ఇచ్చిన వివరాలను బహిర్గతం చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో దేశంలో ఉన్న అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన మొత్తం విలువలు బయట పడ్డాయి. దీంతో ఎలక్టోరల్ బాండ్ల విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.