పూటకో పార్టీ మార్చే అవకాశవాద దొరసాని డీకే అరుణ : చల్లా వంశీచంద్ రెడ్డి

-

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లోక్ సభ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గద్వాల బంగ్లా రాజకీయాలు చేసే దొరసాని డీకే అరుణ అని విమర్శించారు.నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో వంశీచంద్ పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను ఎదగనివ్వకుండా అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ముదిరాజ్, యాదవ, కుర్మలకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే వారిని ఓడించేందుకు ప్లాన్ చేశారని మండిపడ్డారు.పూటకో పార్టీ మార్చే అవకాశవాద దొరసాని అని విమర్శించారు.

నారయణపేటకు వచ్చిన సైనిక్ స్కూల్ వెళ్తుంటే స్పందించలేదని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పదవుల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదని మండిపడ్డారు.కొడంగల్ నారయణపేట నియోజకవర్గాలు రెండూ రెవంత్ రెడ్డి కళ్లు లాంటివని అన్నారు. రూ.5 వేల కోట్లతో కొడంగల్ లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. జీవో 69 తెచ్చి రూ. 2 వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేశారని తెలిపారు. త్వరలో వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రాబోతుందని తెలిపారు. చిట్టెం నర్సిరెడ్డి సంగం బండ ప్రాజెక్టు ప్రారంభమైతుందని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version