ప్రధాని నరేంద్ర మోడీ అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశంలో కరోనా వ్యాప్తి గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఆయన వివరించారు. దాదాపు జాతీయ పార్టీల నేతలు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర వైద్య, హోమ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు…. వైరస్ కట్టడి సహా లాక్ డౌన్ సమస్యలను నేతలకు వివరించారు.
ఈ సమావేశంలో నేతలు వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరత గురించి ప్రధాని ముందు ప్రస్తావించారు. ఇక సందర్భంగా నేతలు ప్రభుత్వానికి పలు సూచనలు చేసారు. పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపేయాలని వారు సూచించారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలని పలు రాష్ట్రాలు కోరుతున్న నేపధ్యంలో…
ప్రధాని కీలక వ్యాఖ్య చేసారు. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని మోడీ అన్నట్టు వార్తలు వస్తున్నాయి. కొవిడ్-19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని మోడీ వ్యాఖ్యానించారు. వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉందని మోడీ వ్యాఖ్యానించారట. శివసేన, బిజెడి, ఎన్సీపీ, కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పీ, డిఎంకె, సహా పలు పార్టీల నేతలు పాల్గొన్నారు.