విమాన ప్రమాదం: కేరళ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్..!

-

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ప్రధాని మోదీ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫోన్ చేశారు. ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలు, సహాయ చర్యలపై ప్రధాని ఆరా తీశారు. ఈ సందర్భంగా కోజికోడ్, మలప్పురం జిల్లాల కలెక్టర్లు సహాయక చర్యలు చేపడుతున్నారని సీఎం విజయన్ ప్రధానికి తెలిపారు. ఐజీ అశోక్ యాదవ్ కూడా ఘటన ప్రాంతానికి చేరుకొని సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అయితే ప్రమాద సమయంలో 174 మంది ప్రయాణికులు, 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు క్యాబిన్ సిబ్బంది విమానంలో ఉన్నారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version