భారత ప్రధానిగా నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉత్తరప్రదేశ్ లోని తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో జూన్ 18 న పర్యటిస్తారని బిజెపి నాయకులు తెలిపారు. అక్కడ నిర్వహించే రైతు సదస్సులో ప్రసంగిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. రోహానియా లేదా సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గంలో రైతు సదస్సుకు వేదికను ఎంపిక చేసే పనిలో ఉన్నట్టు స్థానిక బిజెపి నాయకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. మోడీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించడానికి గులాబ్ బాగ్ లోని పార్టీ కార్యాలయంలో మహానగరం జిల్లా అధికారుల సమావేశం నిర్వహించారు.
బిజెపి కాశీ ప్రాంత అధ్యక్షుడు దిలీప్ పటేల్ మాట్లాడుతూ.. రైతులను ఉద్దేశించి మోడీ ఈ సదస్సులో మాట్లాడుతారని రోజంతా ఆయన పర్యటన నియోజకవర్గంలో కొనసాగుతుందని తెలిపారు. రైతుల సదస్సులో ప్రసంగించిన అనంతరం ప్రధాని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు చేస్తారని దశా మీద షూట్లో గంగా హారతిలో పాల్గొంటారని పటేల్ చెప్పారు. రికార్డ్ స్థాయి మెజార్టీతో గెలిచి వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ సకారం చేసిన మోడీ తన నియోజకవర్గానికి రానుండటంతో ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారీ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని దిలీప్ పటేల్ సూచించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ తన వారణాసి స్థానాన్ని వరుసగా మూడోసారి నిలబెట్టుకున్నారు.