ప్రధాని మోడీ, కిషన్ రెడ్డిపై దుర్బాష.. అద్దంకి, అంజన్ కుమార్‌లపై పీఎస్‌లో ఫిర్యాదు

-

కాంగ్రెస్ నేతలు ఈడీ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మర్యాద లేకుండా మాట్లాడటంతో పాటు కొన్ని బూతులు కూడా వాడినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రివర్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ చేసిన అసభ్యమైన మాటలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సరూర్ నగర్ పీఎస్‌లో సీఐ సైదిరెడ్డికి అద్దంకి దయాకర్, అంజన్ కుమార్ యాదవ్ లపై ఫిర్యాదు చేశారు. వారిపై తక్షణమే తగిన చర్యలు తీసుకొని FIR ఫైల్ చేయాలని డిమాండ్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news