రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వాటర్ ట్యాంకులో గుర్తుతెలియని దుండగులు పురుగుల మందు కలిపినట్లు తెలిసింది. ట్యాంక్‌తో పాటు మధ్యాహ్న భోజన సామగ్రిపైనా పురుగుల మందు చల్లినట్లు గుర్తించారు. సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై పోలీసులకు హెచ్‌ఎం ప్రతిభ ఫిర్యాదు చేశారు.ఈ పాఠశాలలో 30 మంది విద్యార్థులు చదువుతున్నారు. సిబ్బంది గమనించకుంటే విద్యార్థుల పరిస్థితి ఏంటని పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.