తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు ఆశావహులు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోనిరసన జ్వాలలు క్రమంగా పెరుగుతున్నాయి.మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా చేస్తున్నారని ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు.

మరోవైపు గడ్డం వివేక్ కుటుంబంలో ఇప్పటికే మూడు పదవులు వచ్చాయని.. వారికి మంత్రి పదవి ఎలా ఇస్తారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పెదవి విరిచారు. అంతటితో ఆగకుండా అన్ని పార్టీల్లో తిరిగి వచ్చిన వారికి ఎలా ఇస్తారు? తాను కూడా మంత్రి పదవికి అర్హుడినే అంటూ బాంబ్ పేల్చారు. దీనికి తోడు నిన్న సీఎం రేవంత్ అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ భేటీకి మంత్రి పదవి ఆశిస్తున్న గడ్డం వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.ఇలా పార్టీలో నేతల మధ్య గొడవలు, నిరసన జ్వాలలు క్రమంగా పెరుగుతుండగా.. అసంతృప్తిని కంట్రోల్ చేసేందుకు సీఎం పరోక్ష ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.