వ‌రంగ‌ల్‌కు వైద్యం కోసం వ‌చ్చిన మ‌హిళా మావోయిస్టు అరెస్ట్

-

మెడిక‌ల్ ట్రీట్‌మెంట్ కోసం అడ‌విని వ‌దిలి, ఆస్ప‌త్రికి వ‌చ్చిన ఓ మ‌హిళా మావోయిస్టుతో పాటు మ‌రో ముగ్గురు సానుభూతి ప‌రుల‌ను అరెస్టు చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ నుంచి వైద్యానికి వ‌చ్చిన వారి నుంచి 50 జిలెటిన్ స్టిక్స్‌, 50 డిటోనేట‌ర్లు, రూ. 74 వేల న‌గ‌దు, ఒక కారు, సెల్‌ఫోన్లతో పాటు విప్ల‌వ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్టు అయిన వారిని దంకార‌ణ్యం సౌత్ జోన్‌కు చెందిన డాక్ట‌ర్స్ టీమ్ క‌మాండ‌ర్ మద‌కం ఉంగి అలియాస్ క‌మ‌ల‌(30), అసం సోహేన్(35), మీచ్ అనిత‌(21), గొడ్డి గోపాల్‌గా గుర్తించారు. ఈ న‌లుగురు కూడా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని వివిధ ప్రాంతాల‌కు చెందిన వార‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా వ‌రంగ‌ల్ సెంట్ర‌ల్ జోన్ డీసీపీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ములుగు – వ‌రంగ‌ల్ రోడ్డులో మావోయిస్టులు సంచ‌రిస్తున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో ములుగు – వ‌రంగ‌ల్ ర‌హ‌దారిలోని అజ‌రా హాస్పిట‌ల్ వ‌ద్ద విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా, ఓ కారు అనుమానాస్ప‌ద స్థితిలో క‌నిపించింది. ఈ వాహనాన్ని త‌నిఖీ చేయ‌గా, భారీగా పేలుడు ప‌దార్థాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని తెలిపారు. కారులో ప్ర‌యాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా, మావోయిస్టుల‌ని తేలింద‌న్నారు. మ‌ద‌కం ఉంగి చికిత్స నిమిత్తం వ‌రంగ‌ల్‌లోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి వ‌చ్చింద‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version