మహారాష్ట్ర అసెంబ్లీకి ఈనెల 20న ఎన్నికల పోలింగ్ జరగనుంది. సోమవారంతో అక్కడ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఆ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల తరఫున ప్రచారం నిర్వహించేందుకు తెలంగాణ, ఏపీ నుంచి కీలక నేతలు అక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహరాష్ట్రలో విధుల నిర్వహణలో ఉన్న పోలీసులు మద్యం సేవిస్తూ కెమెరాలకు చిక్కారు.
ఈ ఘటన ఆ రాష్ట్రంలోని కోటగిరి పోలీస్‌స్టేషన్ పరిధి పోతంగల్ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద వెలుగుచూసింది. ఎన్నికల విధులు నిర్వహిస్తూ ప్రధాన రహదారి పక్కనే మద్యం గ్లాసులు పెట్టుకుని పలువురు పోలీసులు మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆ దృశ్యాలను తన వద్దనున్న కెమెరాలో బంధించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. విధినిర్వహణలో మద్యం సేవించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
నడిరోడ్డుపైనే మద్యం సేవించిన పోలీసులు…
👉మహారాష్ట్రలోని కోటగిరి పోలీస్ స్టేషన్ పరిధి పోతంగల్ శివారులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మద్యం సేవించిన పోలీసులు
👉ఎన్నికల విధులు నిర్వహిస్తూ ప్రధాన రహదారికి పక్కనే మద్యం గ్లాసులు పెట్టుకుని కెమెరాకు చిక్కిన ముగ్గురు పోలీసులు. pic.twitter.com/hykoZpj7rg— ChotaNews (@ChotaNewsTelugu) November 19, 2024