రాష్ట్రపతి వద్దకు లగచర్ల పంచాయితీ చేరింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం లగచర్ల బాధిత కుటుంబాలు.. ఎదురు చూస్తున్నాయి. ఢిల్లీలో లగచర్ల బాధిత కుటుంబాలు కోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. లగచర్లలో బలవంతపు భూ సేకరణ ఘటనను సంబంధించిన విషయాలను రాష్ట్రపతి కార్యాలయానికి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందజేశారు.
రాష్ట్రపతిని కలసి మా గోడు వినిపించే వరకు ఇక్కడనుండి కదలమంటున్న గిరిజన మహిళలు…రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే లగచర్ల లో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సి,ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి రాష్ట్ర ప్రభుత్వం పై భాదితులు పిర్యాదు చేశారు. రాష్ట్రపతి ని కలసి మా గోడు వినిపించే వరకు ఇక్కడే ఉంటాం అంటున్నారు గిరిజన మహిళలు.