తెలంగాణా పోలీసుల వెంట పడుతున్న ఇతర రాష్ట్రాల పోలీసులు…!

-

ఫేస్బుక్ లో నకిలీ అకౌంట్స్ నేపధ్యంలో నల్లగొండ కు వచ్చారు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక పోలీసులు. టూ టౌన్ సిఐ బాషా, ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డిలతో సమావేశం అయ్యారు. నకిలీ ఫేస్ బుక్ అకౌంట్స్ ముఠా వివరాలు, కేసు ఛేదించిన విధానం గురించి వివరించారు సిఐ బాషా. అన్ని స్థాయిలలో ఇతర రాష్ట్రాల పోలీసులకు సహకరిస్తామని పేర్కొన్నారు. 165 మంది పోలీస్ అధికారుల అకౌంట్స్ నకిలివి క్రియేట్ చేసిన విషయంలో రాష్ట్రాల వారీగా విభజించారు నల్లగొండ పోలీసులు.

తెలంగాణ 72, ఆంధ్ర ప్రదేశ్ 21, బీహార్ 3, హిమాచల్ ప్రదేశ్ 4, జమ్మూ కాశ్మీర్ 1, ఝార్ఖండ్ 1, కర్నాటక 30, కేరళ 1, మహారాష్ట్ర 3, ఒరిస్సా 1, పంజాబ్ 3, తమిళనాడు 15, ఉత్తరాఖండ్ 3, ఉత్తర ప్రదేశ్ 7 మొత్తం కలిపి 165 మంది పోలీస్ అధికారుల నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లు గుర్తించామని తెలిపారు భాషా.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version