న్యూఢిల్లీ: ట్విటర్ ఇండియా చీఫ్‌పై తాజాగా మరో రెండు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటికే ఆయనపై గత వారం యూపీలో ఓ కేసు నమోదు అయింది. వృద్ధుడిపై ఓ యుస్లిం యువకుడి దాడి ఘటనకు సంబంధించి విద్వే షాలు రెచ్చగొట్టేలా కొందరు ట్విటర్‌ను ఉపయోగించారని ట్విటర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరికి ఘజియాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
అయితే మనీష్‌పై గతవారం నమోదు చేసిన కేసులో ఊరట లభించింది. యూపీ పోలీసుల నోటీసులపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు మనీష్‌పై చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఇప్పుడు నమోదైన రెండు కేసుల్లో మనీష్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి.