శభాష్ పోలీస్; ప్రాణాలకు తెగించి కుక్క పిల్లలను కాపాడిన పోలీస్…!

-

సాధారణంగా మనం ఏదైనా జంతువు కష్టాల్లో ఉంటే పెద్దగా వాటి గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయం. ఏదైనా జరుగుతుంది ఏమో అనే భయం మనను వెంటాడుతూ ఉంటుంది. ఇక పాము వద్దకు వెళ్ళాలి అంటే చాలు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది. కాని ఒక పోలీస్ అధికారి మాత్రం ఎక్కడా భయపడకుండా ఒక కుక్క పిల్లను ప్రాణాలకు తెగించి పోరాడారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కుక్క పిల్లను పోలీస్ రక్షించే ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాల్ 112 అనే ఉత్తర ప్రదేశ్‌లోని అత్యవసర సేవలకు అంకితమైన ట్విట్టర్ పేజీ ఒకటి ఫోటోని పోస్ట్ చేసింది. అసలు ఎం జరిగింది అనేది వివరించింది. ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఈ సంఘటన జరిగింది. మూడు కుక్కపిల్లలు పాము ఉన్న బావిలో పడటాన్ని అక్కడ ఉన్న స్థానికులు గుర్తించారు.

కాని వాటిని రక్షించడానికి మాత్రం ఎవరూ ముందుకి రాలేదు. అప్పుడు, పోలీసు అధికారి తన ప్రాణాలను పణంగా పెట్టి, నిచ్చెన ఉపయోగించి బావి లోపలికి దిగాడు. అతను బావి నుండి మూడు కుక్కపిల్లలను సురక్షితంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసు అధికారి తన మానవత్వాన్ని చాటుకున్నారని పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version