ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై గుర్తుతెలియని నలుగురు దుండగులు సామూహిక ఆత్యాచారానికి పాల్పడారు. అనంతరం ఆ మహిళను దారుణంగా హతమార్చారు. ఈ ఘటన గత నెలలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. అక్టోబర్ 15వ తేదీన మృతురాలు కనిపించకుండా పోయింది. అయితే, 17వ తేదీన ఆమె మృతదేహం లభ్యమైంది.
తన భార్య మృతిపై అనుమానం వ్యక్తం చేసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణలో ఆ మహిళను నలుగురు దుండగులు ఆత్యాచారం చేసి చంపేసారని తేలింది. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు డీఎస్పీ భవ్య కిషోర్ వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం వారికి రిమాండ్ విధించింది.