చైనాకు పారిపోయిన లోన్ యాప్స్ కంపెనీల డైరెక్టర్లు ?

-

తెలుగు రాష్ట్రాల్లో లోన్ యాప్స్ ఎంతగా కలకలం సృష్టించాయనేది తెలియని విషయం కాదు. లోన్ యాప్స్ ప్రతినిధుల వేధింపులకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు మొత్తం నెట్ వర్క్ ఆట కట్టించే పనిలో పడ్డారు. అయితే తాజాగా లోన్ యాప్స్ కంపెనీల డైరెక్టర్లు చైనాకు పారిపోయినట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. పారిపోయిన డైరెక్టర్ల తిరిగి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

చైనాకు పారిపోయిన డైరెక్టర్ కోసం రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర సహాయంతో డైరెక్టర్లని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇండియాకు చెందిన పలువురుని కూడా చైనా కంపెనీలు డైరెక్టర్లుగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ నేరం చేసినా సరే తమ మీదకు రాకుండా ఇండియన్స్ ని డైరెక్టర్స్గా నియమించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 16 కంపెనీల మీద దాడి చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వివరాలన్నీ గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version