గంజాయి కేసులో కాంగ్రెస్ నాయకుడి డ్రైవర్, వంట మనిషిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు పోలీసులు. హైదరాబాద్ నగరంలోని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. యూసఫ్ గూడలో బోనాల పండుగ సందర్భంగా హల్ చల్ చేసిన గంజాయి బ్యాచ్ ఈ బ్యాచ్ లోని జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ డ్రైవర్‌తో పాటు వంట మనిషిని అదుపులోకి తీసుకొని పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.
థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో పాటు ఈ కేసులో నవీన్ యాదవ్ పేరు కూడా చెప్పాలని పంజాగుట్ట ఏసీపీ రెండు రోజుల పాటు హింసించారని బాధితులు ఆరోపించారు. అరెస్ట్ చేసిన మూడో రోజుకు కోర్టులో హాజరు పరచిన పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటెంప్ట్ టూ మర్డర్ కేస్ ఎలా వర్తిస్తుందని పోలీసులను ప్రశ్నించింది నాంపల్లి కోర్టు. దీనికి పోలీసులు సైలెంట్ కావడం గమనార్హం. ఇటీవలే శంషాబాద్ లో పోలీసులు థర్డ్ డిగ్రీ నిర్వహించడంతో దళిత మహిళకు గాయాలైన విషయం తెలిసిందే.