బెజవాడలో హైఅలెర్ట్…!

-

ప్రకాశం బ్యారేజ్ పై భారీగా పోలీసులు మొహరించారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్న మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. రాజధాని గ్రామాల్లో ఎక్కడికక్కడ మహిళ రైతులను అడ్డుకున్నారు. దీనితో రాజధాని ప్రాంత మహిళలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. మహిళ రైతులను ఎక్కడికక్కడ అడ్డుకోవడం పై నిరసనగా ప్రకాశం బ్యారేజ్ పై కూర్చుని మహిళలు, రైతులు నిరసన తెలుపుతున్నారు.

మహిళ రైతులను అరెస్టు చేసి పి ఎస్ కు పోలీస్ లు తరలించారు. మహిళల అరెస్ట్ లు జరుగుతున్న మీ పనులు చూసుకుంటారా అంటూ వాహనదారులు పై మహిళా రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళలను అరెస్ట్ చేసిన విధానం తోపులాట పేరుతో మహిళ రైతులును గాయపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. మహిళ దినోత్సవం రోజు మహిళలకు ఈ ప్రభుత్వం అరెస్ట్ లు బహుమతి గా ఇచ్చిందని మహిళలు అంటున్నారు.

ఇక రాజధాని ఉద్యమంలో భాగంగా అమరావతిలో 29 గ్రామాల రైతుల మహిళలు దాదాపుగా 500 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని గతంలో సందర్శించుకోవాలి అని భావించినా సరే పోలీసులు అడ్డుకుని ఇబ్బందులు పెట్టారు. మహిళలు విజయవాడ రాకుండా పోలీసులుభారీగా మొహరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version