థర్డ్ ప్లేస్‌కు హస్తం…పక్కా ప్లాన్ ప్రకారమేనా?

-

తెలంగాణలో టి‌ఆర్‌ఎస్, బి‌జే‌పి పార్టీల మధ్య రాజకీయ యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీలు నువ్వా-నేనా అన్నట్లు తలపడుతున్నాయి. అసలు రెండు పార్టీల మధ్య వార్ పీక్స్‌కు చేరుకుంది. అంటే తెలంగాణ రాజకీయాలు మొత్తం ఆ రెండు పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం పూర్తిగా వెనుకబడింది. అసలు తెలంగాణలో టీఆర్ఎస్ తర్వాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. బీజేపీకి అసలు రాష్ట్ర స్థాయిలో బలం లేదు.

bjp-trs

కాకపోతే ఉపఎన్నికల్లో గెలిచాక సీన్ మారింది…బీజేపీ కూడా పుంజుకుంది. కానీ బీజేపీకి కాంగ్రెస్ అంత బలం లేదు. అయినా సరే టీఆర్ఎస్ తర్వాత బీజేపీ సెకండ్ ప్లేస్‌లో ఉన్నట్లు వార్ నడుస్తోంది. దీంతో రేసులో కాంగ్రెస్ వెనుకబడినట్లు కనిపించింది. పైగా టీఆర్ఎస్ సైతం బీజేపీనే ప్రధాన ప్రత్యర్ధిగా చూస్తూ.. ఆ పార్టీపై విమర్శలు చేస్తుంది. కానీ కాంగ్రెస్‌పై ఫోకస్ చేయడం లేదు. దీంతో కాంగ్రెస్ పూర్తిగా వెనుకబడిపోయినట్లు అయింది.

అంటే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ థర్డ్ పొజిషన్‌కు పడిపోయిందని విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే ఇదంతా ఒక డ్రామా అని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్‌ని దెబ్బకొట్టడానికి టీఆర్ఎస్-బీజేపీలు కలిసి డ్రామా ఆడుతున్నాయని అంటున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ కావాలని బీజేపీని పైకి లేపుతుందని, అప్పుడు కాంగ్రెస్ మూడో ప్లేస్‌లో ఉందని చూపించాలని అలా చేస్తున్నారని చెబుతున్నారు.

బీజేపీని పైకి లేపి కాంగ్రెస్‌ని తక్కువ చేయడం వల్ల…ఓట్లలో చీలిక వచ్చి టీఆర్ఎస్‌కు లబ్ది జరుగుతుందనేది కేసీఆర్ ప్లాన్ అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఎదిగితే ఇబ్బంది కాబట్టే బీజేపీని లేపుతున్నారని, ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని అంటున్నారు. అయితే ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి…వాటిని చేధించి పార్టీని రేసులో నిలబెట్టాల్సిన బాధ్యత రేవంత్‌ది. అలా కాకుండా రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయని విమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఉండదు…ఇంకా కాంగ్రెస్ మూడో ప్లేస్‌లోనే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version