పంజాబ్, కేంద్ర ప్రభుత్వాల మధ్య ప్రధాని మోదీ సభ రద్దు పొలిటికల్ వివాదంగా మారింది. భద్రతా వైఫల్యాలతో ప్రధాన నరేంద్రమోదీ సభను అర్థాంతరంగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మోదీ ప్రయాణిస్తున్న మార్గంలో ఆందోళనకారులు అడ్డుకోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. అయితే ఈ వివాదం బీజేపీ- పంజాబ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ల మధ్య రాజకీయ దుమారం రేపింది.
తాజాగా ప్రధాని మోదీ భద్రత వైఫల్యంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పంజాబ్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. పంజాబ్ ప్రభుత్వం ప్రధాని మోదీకి హానీ చేయాలనే ఇలా చేసిందా.. అని ప్రశ్నించింది. ప్రధాని రూట్ మ్యాప్ ఎలా లీకయిందని ప్రశ్నించింది. ప్రధాని భద్రత విషయాల పోలీసుల దగ్గర నుంచి ఎలా లీక్ అయ్యాయి. 20 నిమిషాల పాటు ప్రధాని మార్గం మధ్యలో ఎలా అడ్డుకున్నారు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వ సమాధానం చెప్పాలని స్మృతి ఇరానీ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. పంజాబ్ సీఎం ఛన్నీ ఫిరోజ్ పూర్ ఎస్పీని సస్పెండ్ చేశారు.